Share News

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు

ABN , Publish Date - May 21 , 2025 | 11:01 PM

‘కొనుగోలులో అలసత్వం’ శీర్షికన బుధవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈమేరకు సంబంధిత జిల్లాస్థాయి అధికారుల ఆదేశాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం ధాన్యంకొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు
పులికల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

- ఆంధ్రజ్యోతి కథనాలకు స్పందన

అయిజ, మే 21 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న అవస్థలను వివరిస్తూ ‘కొనుగోలులో అలసత్వం’ శీర్షికన బుధవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈమేరకు సంబంధిత జిల్లాస్థాయి అధికారుల ఆదేశాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం ధాన్యంకొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. డీటీలు ప్రశాంత్‌గౌడు, ఉదయ్‌ అయిజ పట్టణంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు పులికల్‌, ఉప్పల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రాకుండా చూడాలని తెలిపారు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని కొనుగో లు నిర్వాహకులకు ఆదేశించారు. ఖాళీ సంచుల కొరతలేకుండా చూడాలని తెలిపారు.

అయిజ మునిసిపల్‌ ఏఈ సస్పెన్షన్‌

- ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌

అయిజ టౌన్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): అయిజ మునిసిపాలిటీ ఏఈ రాజశేఖర్‌ను సస్పెండ్‌ చే స్తూ మంగళవారం కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 18న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘అయిజలో కలుషిత నీరు సరఫరా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మిషన్‌ భగీరథ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. దీంతోపాటు అయిజ మునిసిపల్‌ కమిషనర్‌ కూ డా పట్టణంలో ప్రజలకు సరఫరా చేస్తున్న మిషన్‌ భగీరథ తాగునీటి నమూనాలను ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించారు. నిత్యం సరఫరా అవుతున్న తాగునీటిలో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే బ్యాక్టీరియా ఉన్నట్లుగా పరీక్షల్లో తేలిం ది. దీంతోపాటు మిషన్‌ భగీరథ అధికారులు జరిపిన అంతర్గత విచారణలో కూడా తాగునీటి ని సరఫరా చేసే ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవటం వల్ల కూడా తాగునీరు కలుషితం అవుతున్నట్లు గు ర్తించారు. సంబంధిత అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు గమనించిన అధికారులు, సమగ్ర వివరాలతో కలెక్టర్‌కు నివేదిక అందించా రు. నివేదికను పరిశీలించిన కలెక్టర్‌ ఏఈని సస్పెండ్‌ చే స్తూ నిర్ణ యం తీసుకున్నారు.

మరో ఇద్దరిపై చర్యలు?

ఈ వ్యవహారానికి సంబంధించి మునిసిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి నోటీసులు ఇచ్చేందుకు మునిసిపల్‌ ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. తాగునీటి విభాగంలో పనిచేసే ఇద్దరిలో ఒకరికి షోకాజ్‌ నో టీస్‌, మరొకరికి మెమో జారీ చేయనున్నట్లుగా సమాచారం.

Updated Date - May 21 , 2025 | 11:01 PM