Share News

ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:45 PM

ఉ న్నత చదువులతో పాటు ఉపాధి అవకాశాలను సైతం యువత అందిపుచ్చుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.

ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి

వనపర్తి టౌన్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఉ న్నత చదువులతో పాటు ఉపాధి అవకాశాలను సైతం యువత అందిపుచ్చుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 28వ వార్డు ఆర్డీవో కార్యాల యం సమీపంలో యువకులు ఏర్పాటు చేసుకు న్న గ్రామీణ ఫుడ్స్‌ దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే స్వయం ఉపాధిపై దృష్టి సారిం చే యువకులకు భవిష్యత్తు బాగుంటుందని అ న్నారు. కార్యక్రమంలో ఫుడ్స్‌ సెంటర్‌ నిర్వాహ కులు నరసింహస్వామి, శివ, కాంగ్రెస్‌ పార్టీ నా యకులు సత్యశిలారెడ్డి, ఎల్‌ఐసీ కృష్ణ, శివ తది తరులు ఉన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:45 PM