Share News

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:21 PM

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఖిల్లాఘణపురంలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

ఖిల్లాఘణపురం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాన్ని, ఎన్నికల్లో విధులు నిర్వహిం చే ఉద్యోగులకు ఏర్పాటు చేసిన సదు పాయాలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియంలో ప్రతీ ఓటు కీలకమని తెలిపారు. ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించు కోవాలని సూచించారు. ఫారం 14 దర ఖాస్తు చేసుకున్న వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సిబ్బంది సహకరించాలన్నారు. పోలింగ్‌ సమ యంలో లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళి కచ్చితంగా పాటించాలని ఉద్యోగులను ఆదేశించారు. కార్యక్రమం లో తహసీల్దార్‌ సుగుణ, ఎంపీడీవో విజయసింహారెడ్డి అధికారులు తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 11:21 PM