నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:38 PM
పంచాయతీ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు ప్రతీ అధికారి పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాలన్యూటౌన్, డిసెంబరు2(ఆంధ్రజ్యోతి): 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు ప్రతీ అధికారి పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీవోసీ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. అధికారులు సూచనల పుస్తకంపై పూర్తి అవగాహన పెంచుకొని నియమాలను తప్పకుండా పాటించాలని ఆదేశించా రు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత, వెబ్‌కాస్టింగ్, సౌకర్యాలపై అధికారులు ప్రత్యే పర్యవేక్ష ణ చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వడంతో పాటు పోలింగ్‌కు ముందురోజు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సామాగ్రిని ప్రెసిడింగ్ అధికారులకు సక్రమంగా అందించేలా పర్యవేక్షించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిషేఽధించాలని ఆదేశించారు. భద్రత, ఓటర్ల సదుపాయాలు సక్రమంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీపీవో శ్రీకాంత్, ఎన్నికల ట్రైనింగ్ నోడల్ అఽధికారి రమేష్‌బాబు, ట్రైనర్స్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.