ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:16 PM
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలను ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిర్వహించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ చెప్పారు.
జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
మండలాల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం
గద్వాల న్యూటౌన్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలను ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిర్వహించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ చెప్పారు. బుధవారం గద్వాల ఐడీవోసీలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించా రు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణ, నిబంధనలపై నిర్వహిస్తున్న శిక్షణపై పూర్తి అవగాహనతో ఎన్నికల విధులు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. అధికారు లు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, పరస్పరం సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఏ దశలోనూ అలసత్వానికి తావులేకుండా, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అనుక్షణం జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ స్ర్కుటీనీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ తదితర అన్ని ప్రక్రియలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, ఏ చిన్న సమ స్యను రానివ్వకూడదని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీపీవో నాగేంద్రం, శిక్షణ జిల్లా నోడల్ అధికారి రమేశ్‌బాబు, మాస్టర్ ట్రైనర్ నరేష్, జహీరుద్దీన్, అగస్ట్రీన్, విష్ణు, కృష్ణ ఉన్నారు.