Share News

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Oct 07 , 2025 | 10:56 PM

స్థానిక సంస్థల ఎన్నికలను ఎటువంటి పొ రపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాని కలెక్టర్‌ విజయేందిరబోయి తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో త్వ రలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రిసైడిండ్‌ అధికారులకు మంగళవారం శిక్షణ ఇచ్చారు.

ఎన్నికలు పకడ్బందీగా  నిర్వహించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికలను ఎటువంటి పొ రపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాని కలెక్టర్‌ విజయేందిరబోయి తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో త్వ రలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రిసైడిండ్‌ అధికారులకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో అధికారుల విధులు చాలా కీలకమన్నారు. చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వొద్దన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల విధుల నిర్వహణపై హ్యాండ్‌ బుక్‌లోని ప్రతీ అంశంపై స్పష్టమైన అవహన కలిగి ఉండాలన్నారు. సందేహాలు ఉంటే శిక్షణలో నివృతి చేసుకోవాలన్నారు. మాస్టర్‌ ట్రైనర్స్‌ ఎన్నికల నిర్వహణ, ప్రిసైడింగ్‌ అధికారుల విధులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శిక్షణ నిచ్చారు. కార్యక్రమంలో డీపీఓ పార్థపారథి, మాస్టర్‌ ట్రైనర్‌ బాలుయాదవ్‌, ఇతర శిక్షణ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 11:10 PM