Share News

ఎన్నికల కోడ్‌ నియమావళిని పాటించాలి

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:42 PM

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ నియమావళిని పాటించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు.

ఎన్నికల కోడ్‌ నియమావళిని పాటించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ నియమావళిని పాటించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలకు సంబంధించిన గోడ రాతలు, వాల్‌పోస్టర్‌, ఫ్లెక్సీ బ్యానర్లు తొలగించాలని సూచించారు. ఎన్నికలు జరుగు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అన్ని రాజకీయ వర్గాల ప్రతి నిధులు ఎన్నికల నియమావళి పాటించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలకు లోబడి ఎన్నికల ఖర్చును వినియోగించుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వ్యయ పరిమితిని ఖరారు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

అదేవిధంగా నోడల్‌ అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాల అధికారులకు శిక్షణ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచార కరపత్రాలపై తప్పనిసరిగా ప్రింటర్ల సమాచారం ఉండాలని రాజకీయ పార్టీ లకు సూచించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావే శంలో అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవసహాయం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, డిప్యూటీ సీఈవో గోపాల్‌ నాయక్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:42 PM