Share News

ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యసేవలకు కృషి

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:30 PM

విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్య సేవలు అందించేందుకు నావంతు కృషి చేస్తాన ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యసేవలకు కృషి
శిబిరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • ఉచిత కంటి వైద్యశిబిరం ప్రారంభం

గద్వాలటౌన్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్య సేవలు అందించేందుకు నావంతు కృషి చేస్తాన ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మం త్రి దృష్టికి తీసుకువెళ్లి ఈ ప్రాంతంలోని ప్రజల కు కర్నూలు, రాయచూరు జిల్లాకేంద్రాల్లో ఈహెచ్‌ఎస్‌ పథకం అమలుచేసే విధంగా కోరుతా నని తెలిపారు. మంగళవారం పట్టణంలోని పాతహౌసింగ్‌ బోర్డు కాలనీలోని విశ్రాంత ఉద్యోగం సంఘం ఆధ్వర్యంలో, హైదరాబాద్‌ మణికొండ లోని సుశీల నేత్రాలయం డాక్టర్‌ సుధాకర్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా శిబిరంలో ఎమ్మెల్యేకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సంద ర్బంగా మాట్లాడిన ఎమ్మెల్యే, త్వరలోనే విశ్రాంత ఉద్యోగుల కమిటీ హాల్‌ భవనం పనులు ప్రారంభించి అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు తనవంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఉచిత కంటి వైద్యశిబిరంలో 80మందికి కంటి పరీక్షలు నిర్వ హించగా, 12మందిని శస్త్రచికిత్స కోసం తరలించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్‌ కురువ హనుమంతు, జిల్లా గ్రంథాల యం చైర్మన్‌ రామన్‌గౌడ్‌, వేణుగోపాల్‌, మాజీ ఎంపీపీ విజయ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, మాజీ కౌన్సిలర్‌ నరహరిగౌడ్‌, ఉరు కుందు, చంద్రశేఖర్‌, యుగంధర్‌గౌడ్‌, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్‌ ఉన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 11:30 PM