Share News

వాలీబాల్‌ క్రీడా అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:30 PM

జిల్లాలో వాలీబాల్‌ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తామని వాలీబాల్‌ అసో సియేషన్‌ నూతన జిల్లా అధ్యక్షుడు వార్ల విజయ్‌కుమార్‌, ప్రధానకార్యదర్శి దామో దర్‌రెడ్డి అన్నారు.

వాలీబాల్‌ క్రీడా అభివృద్ధికి కృషి

- వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వార్ల విజయ్‌కుమార్‌

నారాయణపేట, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వాలీబాల్‌ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తామని వాలీబాల్‌ అసో సియేషన్‌ నూతన జిల్లా అధ్యక్షుడు వార్ల విజయ్‌కుమార్‌, ప్రధానకార్యదర్శి దామో దర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అసోసి యేషన్‌ కార్యవర్గన్ని ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. అధ్యక్షుడిగా వార్ల విజయ్‌కుమార్‌, ప్ర ధాన కార్యదర్శిగా దామోదర్‌రెడ్డి, కోశాధికారిగా మక్తల్‌ రఘు ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో మండల స్దాయిలో అన్ని సౌకర్యా లతో వాలీబాల్‌ కోర్టులు నిర్మిస్తామన్నారు. జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలన్నా రు. కార్యక్రమంలో పరిశీలకుడు హనీఫ్‌, చెన్న వీరయ్య, డీవైఎస్‌వో వెంకటేష్‌, వెంకటప్ప, బాల్‌ రాజ్‌, సాయినాథ్‌, అనంతసేన, జగదీష్‌, నవీన్‌, పోషల్‌ వినోద్‌, మహేష్‌, తిలక్‌, శ్రీనివాస్‌, అమరేష్‌, అక్తర్‌పాషా పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 11:30 PM