ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌లో సౌకర్యాల కల్పనకు కృషి
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:59 PM
ర్యాలం పాడు ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌లో నివశించే ప్రజల కు ప్రభుత్వ సహకారంతో అన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
ధరూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ర్యాలం పాడు ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌లో నివశించే ప్రజల కు ప్రభుత్వ సహకారంతో అన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం ధరూర్ మండలంలోని ర్యాలంపాడు ఆర్‌అండ్ ఆర్ సెంటర్‌లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పైప్‌లైన్ ఎమ్మెల్యే భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రూ.30 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న 900లీటర్ల వాటర్ ట్యాంక్ పైప్‌లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ర్యాలంపాడు ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌లో ఇంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. తాగునీటి సౌకర్యం కోసం మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మా ణం చేపట్టి పైప్‌లైన్ ద్వారా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్లు అందిస్తామని తెలిపారు. త్వరగా వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. భవిష్య త్‌లో ఈ ప్రాంతంలో అన్నిసదుపాయాలు కల్పిం చి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వ సహాయ సహాకారాలతో ర్యాలంపాడు ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురువ హనుమంతు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శ న్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీరాములు, విజయ్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, యుగంధర్ గౌడ్, నాగులుయాదవ్, సంగాల నర్సింహులు, నాగన్న, హనుమంతు రుఎడ్డి, పురుషోత్తం, కార్యకర్తలు ఉన్నారు.