Share News

మత్తు పదార్థాల నియంత్రణకు కృషి

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:29 PM

జిల్లాలో మత్తు పదార్ధాల బారిన పడకుండా అ ధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు.

మత్తు పదార్థాల నియంత్రణకు కృషి

గద్వాల న్యూటౌన్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మత్తు పదార్ధాల బారిన పడకుండా అ ధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మిషన్‌ పరివర్తన మత్తు పదార్థాల వినియోగం, నిర్మూలన కోసం సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మత్తుపదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, ఆలోచనశక్తి సామర్థ్యాన్ని దెబ్బతీసి ఆరోగ్యం, ఆలోచనాశక్తి సామర్ధ్యాన్ని, దెబ్బతీసే ఆరోగ్యానికి హాని కలిగిస్ల్తుందని హె చ్చరించారు. మాదకద్యవ్యాల క్రయవిక్రయాలు గుర్తిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. కార్యకమంలో జిల్లా సంక్షేమాధికారి సునంద, జిల్లా ఉపాధి కల్పనాధికారి డాక్టర్‌ ప్రియాంక, ఎల్డీఎం శ్రీనివాసరావు, డీపీఆర్‌వో ఆరీఫుద్దీన్‌, పౌరసంబంధాల శాఖ మేనేజర్‌ విమల తదితరులు ఉన్నారు.

ఐక్యంగా పోరాడుదాం : ఎస్పీ

గద్వాల క్రైం : మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. నషా ము క్త్‌ భారత్‌ అభియాన్‌-2025లో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సా మూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్య దుర్వినియోగం, దుష్ప్రభావాల గురించి విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా న షా ముక్త్‌ భారత్‌ అభియాన్‌(ఎన్‌ఎంబిఏ)ను ప్రభుత్వం అమలు చేస్తుదన్నారు. కార్యక్రమంలో సాయుధ దళ డీఎస్పీ నరేందర్‌రావు, కార్యాలయ ఏవో సతీష్‌, ఆర్‌ఐ వెంకటేష్‌, డీసీఆర్బీ ఎస్‌ఐ షుకూర్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 07:18 AM