క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:30 PM
క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
- కలెక్టర్ సిక్తా పట్నాయక్
- టీబీ వ్యాధిగ్రస్తులకు కిట్లు పంపిణీ
నారాయణపేటటౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నారా యణపేటను క్షయ వ్యాధి రహిత జిల్లాగా మా ర్చడానికి మనమంతా కృషి చేయాల్సిన అవస రం ఉందన్నారు. జిల్లాలో 14,707 పరీక్షలు నిర్వ హించగా 903 కేసులు నమోదయ్యాయని, వాటి లో 183 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. అనంతరం ఆమె టీబీ వ్యాధిగ్రస్తులకు కిట్లను పంపిణీ చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిష్టమ్మ, సూపరిం టెండెంట్ సులోచన, శ్రీధర్, భీష్మ ఫౌండేషన్ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని కలెక్టర్ సిక్తాపట్నాయక్ సోమవారం ప్రారంభించారు. కేంద్రాన్ని ఏర్పాటుచేసిన సొసైటీ సభ్యులను ఆమె అభినందించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. ప్రజావాణికి వచ్చే ప్రజలు, మిగతా వాళ్లు అందరు వేసవిలో చల్లదానానికి అంబలి తాగాలని ఆమె తెలిపారు. కలెక్టరేట్ ఏవో జయసుధ, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కె.సుదర్శన్‌రెడ్డి, లయన్స్‌క్లబ్ సీనియర్ సభ్యులు ఆత్మారాం, ఏడ్కేకన్న, జగదీష్ తదితరులున్నారు.
ప్రజావాణికి 25 ఫిర్యాదులు
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 25 ఫిర్యాదులు అం దాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలె క్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్‌కు విన్నవిస్తూ ద రఖాస్తులు అందించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్‌షాలం, ఆర్డీవో రాంచందర్‌నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.