Share News

విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:02 PM

విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు.

విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి
విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

-బీసీ హాస్టల్‌లో వసతులపై అసహనం

పెబ్బేరు, జూలై 18 (ఆంద్రజ్యోతి): విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల, బీసీ వసతి గృహాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నోటు బుక్‌ లు అందజేశారు. గతం కంటే ఈ సంవత్సరం పక్కా ప్రణాళికతో పది ప రీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాల న్నారు. బడిబాట ద్వారా విద్యార్థుల నమోదుపై ఆరా తీశారు. విద్యార్థుల నైపుణ్యం, జ్ఙానం, పరీక్ష ఫలితాలను సమీక్షించి విద్యార్థుల్లో ఇంకా సా మర్థ్యాల పెంపుదలకు కృషి చేయాలని సూచించారు. ఉత్తీర్ణత శాతం తగ్గితే సహించేది లేదన్నారు. బీసీ వసతి గృహంలో వార్డెన్‌ లేకపో వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్నానపు గదులు, మూ త్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. వసతి గృహంలో ఉన్న గదులలో సౌకర్యాలపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. వ ర్షపు నీరు గదుల్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదే శించారు. కార్యక్రమంలో డీఈవో అబ్ధుల్‌ ఘనీ, ఎంఈవో జయ రాములు, మునిసిపల్‌ కమిషనర్‌ ఖాజా ఆరీఫుద్దీన్‌, శ్రీమంతుల మురళిగౌడ్‌, రోజా తదితరులున్నారు.

Updated Date - Jul 18 , 2025 | 11:02 PM