Share News

సాయిమందిరాల అభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Jun 29 , 2025 | 11:12 PM

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న సాయి మందిరాలను ట్రస్టు సభ్యులు సమష్టిగా అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాయి భక్తవేదిక చైర్మన్‌ మంచుకంటి ధనుంజయ్‌ పిలుపునిచ్చారు.

 సాయిమందిరాల అభివృద్ధికి కృషి చేయాలి
మాట్లాడుతున్న భక్తవేదిక రాష్ట్ర కార్యదర్శి మైనంపాటి ప్రసాద్‌

- తెలంగాణ రాష్ట్ర షిర్డి సాయి భక్త వేదిక చైర్మన్‌ ధనుంజయ్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న సాయి మందిరాలను ట్రస్టు సభ్యులు సమష్టిగా అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాయి భక్తవేదిక చైర్మన్‌ మంచుకంటి ధనుంజయ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సమీపంలోని ద్వారాకమయి మందిరంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సాయి మందిరాల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన పాల్గొని, మాట్లాడారు. సాయిమందిరాలలో గోశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ట్రస్టు సభ్యులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, ఆలయాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రతీ రోజు ఆలయాల్లో పూజ కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహించాలన్నారు. ప్రతీ గురువారం ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి మంచుకంటి ప్రసాద్‌ మాట్లాడుతూ సాయిమాలలను ప్రోత్సహించాలన్నారు. 21, 41 రోజుల పాటు భక్తులు మాలలు ధరించేలా భక్తులన సిద్ధం చేయాలన్నారు. మల్లికార్జున్‌, సిద్ధు, గోవర్ధనాచారి, నరసింహ, సాయిరాం, హన్మంతు, శ్రీనివాస్‌గౌడ్‌, సుధాకర్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు హరిస్వామి, భజన మండలి కార్యదర్శి యాదయ్య, ఆలయ కమిటీ చైర్మన్‌ లక్ష్మీనారాయణ, కార్యదర్శి గోవర్ధనాచారి, ట్రస్టు సభ్యులు చంద్రకాంత్‌రెడ్డి, లయన్స్‌ క్లబ్‌ ప్రసిడెంట్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 11:12 PM