మత్స్యకారుల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Oct 29 , 2025 | 10:41 PM
రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర క్రీడా, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం దేవరకద్ర మండలం కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు.
మంత్రి వాకిటి శ్రీహరి
ఎమ్మెల్యే జీఎంఆర్‌తో కలిసి కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల
దేవరకద్ర, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర క్రీడా, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం దేవరకద్ర మండలం కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం మత్స్యకారలను పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారికి పూర్తిగా అండగా ఉంటుందన్నారు. పూర్తి రాయితీతో కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో 82 మిల్లీ మీటర్ల సైజు ఉన్న 2.50 లక్షల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. దీంతో మత్స్యకారులు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. మక్తల్, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఎమ్మెల్యే, తాను దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాలను సమదృష్టితో చూస్తామన్ని తెలిపారు. అనంతరం నార్లోనికుంట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. దేవరకద్ర మునిసిపాలిటీ వార్డులు బల్సుపల్లి, గోప్లాపూర్, మీన్గోనిపల్లిలో పార్కులకు, దేవరకద్ర మునిసిపాలిటీలో రూ.3 కోట్లతో సీసీరోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ నమూన ఇంటిని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాల్లో మినీ స్టేడియాలు, మూడు మునిసిపాలిటీల్లో చేపల మార్కెట్‌లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర బోయి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెకట్రరీ అరవింద్ కుమార్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ నరేశ్‌బాబు, అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు.