సమర్థవంతమైన నాయకత్వం అవసరం
ABN , Publish Date - Oct 16 , 2025 | 11:51 PM
కాం గ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తిచేయడానికి సమర్థవంతమైన నా యకత్వం అవసరమని కర్ణాటక ఎమ్మెల్సీ నా రాయణస్వామి పేర్కొన్నారు.
- జీఎమ్మార్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని ఏకగీవ్ర తీర్మానం
మూసాపేట/ దేవరకద్ర, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): కాం గ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తిచేయడానికి సమర్థవంతమైన నా యకత్వం అవసరమని కర్ణాటక ఎమ్మెల్సీ నా రాయణస్వామి పేర్కొన్నారు. గురువారం రాత్రి అడ్డాకులలోని మాంగళ్య పంక్షన్ హాల్ అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ స మన్వయం కమిటీ సంఘటన్ సృజన అభియాన్ కార్యక్ర మానికి డీసీసీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎ మ్మెల్యే జి.మధుసూద న్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య పరిశీలకులు క ర్ణాటక ఎమ్మెల్సీ నారా యణస్వామి, ఫిషరీస్ చైర్మన్ మెట్టుస్వామి, టీపీసీసీ పరిశీలకురా లు ఉజ్మా షాకీర్ తదితరులు హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షుల నియామకానికి మండలాల ముఖ్య కార్యకర్తల ద్వారా అభిప్రా యాలను సేకరించారు. కాంగ్రెస్ అఽధికారంలోకి రావడానికి శ్రమించిన ఎమ్మెల్యే జీఎమ్మార్‌ను డీసీసీ అఽధ్యక్షుడిగా నియామకం చేయాలని మూడు మండలాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు. కార్యకర్తలు మూకుమ్మడిగా మద్దతు పలికారు. అభిప్రాయాలను ఈనెల 22న ఏఐసీసీకి నివేదిక అందిస్తామ ని పరిశీలకులు తెలిపారు. టీపీసీసీ అధి కార ప్రతినిధులు హర్షవర్ధన్‌రెడ్డి, అరవింద్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాల అ ధ్యక్షులు కేసీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తోట శ్రీహ రి, శెట్టి చంద్రశేఖర్, ముఖ్యనాయకులు నా గార్జున్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డి, బాల నర్సింహులు, బొక్కలపల్లి దశరథరెడ్డి, లక్ష్మి నారాయణ ఉన్నారు. అలాగే, దేవరకద్రలో ని శ్రీనివాస గార్డెన్‌లో దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాల నాయకులు, కార్యకర్తల సమావే శం ఏర్పాటు చేశారు. మాజీ జడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణమ్మ, టీపీసీ సీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.