విద్యా సంస్థలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:42 PM
జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షే మ గురుకుల విద్యా సంస్థలకు నాణ్యమైన స న్న బియ్యం మాత్రమే సరఫరా అయ్యేలా చూ డాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ఆదే శించారు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షే మ గురుకుల విద్యా సంస్థలకు నాణ్యమైన స న్న బియ్యం మాత్రమే సరఫరా అయ్యేలా చూ డాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ఆదే శించారు. గురువారం అదనపు కలెక్టర్ తన ఛాంబర్‌లో జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం జగన్‌తో కలిసి అన్ని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల డీసీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా లోని అన్ని ప్రభుత్వ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు నాణ్యమైన సన్న బియ్యం మాత్రమే సరఫరా అయ్యేలా చూడాలన్నారు. నాణ్యతలేని బియ్యం వస్తే వాటిని వెంటనే వెనక్కి పంపించే యాలని అధికారులకు సూచించారు. ఈ విష యంపై ఆయా వసతిగృహాల ఇన్‌చార్జిలకు గట్టి గా సూచించాలని తెలిపారు. బియ్యం విషయం లో ఏమైనా సమస్యలు ఉంటే గురుకులాల ఇ న్‌చార్జీలు, డీసీవోలు వెంటనే తమ దృష్టికి తీసు కురావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతలే ని బియ్యాన్ని విద్యార్థులకు పెట్టడానికి వీలు లే దని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా మైనార్టీ అధి కారి అఫ్జలుద్దీన్, డీసీజీవో శుభ లక్ష్మి, డీసీవోలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.