Share News

విద్యా సంస్థలను తనిఖీ చేయాలి

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:24 PM

మండల ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి, విద్యా ఐ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ విజయేందిర బోయి ఆదేశించారు.

 విద్యా సంస్థలను తనిఖీ చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్నకలెక్టర్‌ విజయేందిరబోయి

- కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : మండల ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి, విద్యా ఐ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి సమస్యలను గుర్తిస్తే రిపేర్‌, మౌలిక వసతులు, అత్యవసర పనులను చేయించాలని అధికారులకు సూచించారు. మునిసిపల్‌ కమిషనర్లు తనిఖీ చేపట్టకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, పీఎంఏ సర్వే చేసి అప్‌లోడ్‌ చేయాలని, ప్రతీ పంచాయతీ కార్యదర్శి ప్రతీ రోజు 10 ఇళ్లు చేయాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్‌ మంజూరవుతాయని తెలిపారు. 5 శాతం కంటే తక్కువ సర్వే చేసి అప్లోడ్‌ చేసిన పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున ఎంపీడీవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ పాత గృహాలు, కార్యాలయాలు శిఽథిలావస్థకు చేరిన వాటిని కూల్చి వేయాలన్నారు. చెరువులు, కుంటలు నిండి రోడ్లపై ప్రవహిస్తే బారీ కెడింగ్‌ పెట్టి ట్రాఫిక్‌ డైవర్ట్‌ చేయాలన్నారు. రోడ్లు, చెరువులు గండి పడితే తక్షణ మరమ్మతులు చేట్టాలన్నారు. అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్‌, ఏనుగు నర్సింహరెడ్డి, జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, హౌజింగ్‌ పీడీ వైద్యం భాస్కర్‌ పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 86 ఫిర్యాదులు రాగా, కలెక్టర్‌ స్వయంగా స్వీకరించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదుదారులకు సమాచారం తెలియజేయాలన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 11:24 PM