విద్యార్థికి వినయం నేర్పేది విద్య
ABN , Publish Date - May 21 , 2025 | 10:58 PM
విద్యార్థికి వినయం నేర్పేదే విద్య అని జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో అబ్దుల్ ఘని అన్నారు.

- జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో అబ్దుల్ ఘని
మల్దకల్, మే 21 (ఆంధ్రజ్యోతి): విద్యార్థికి వినయం నేర్పేదే విద్య అని జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో అబ్దుల్ ఘని అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణా ముగింపు కార్యక్రమానికి హాజరైమాట్లాడారు. విద్య అనేది విద్యార్థులకు కేవలం ఉపాధి చూపే అవకాశంగానే కాకుండా వ్యక్తి సర్వతోముఖాభివృద్దికి తోడ్పడుతుందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలో భాగంగానే గ్రామీణ విద్యార్థులను కూడా విలువలతో కూడిన వ్యక్తులుగా తయారు చేయాలని ఈవేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసిందన్నారు. అనేక పాఠశాలల్లో ఏర్పా టు చేసిన ఈ శిభిరాల వల్ల చాలామంది విద్యార్థులు వారిలో ఉండే ఇతర అంతర్గత ప్ర తిభను మెరుగుపరుచుకున్నారని తెలిపారు. ప్రతీ విద్యార్థి పుస్తకం ద్వారానే జీవితంలో ఉన్నతస్థాయికి వస్తాడని అనుకోవటం చాలా తప్పన్నారు. కొందరికి పుస్తకానికి బదులు క్రీడలు, పాటలు. చిత్రలేఖనం, సంగీతం, డ్రాయింగ్ వంటి రంగాలపై మక్కువ ఉంటుందని, అటు వంటి వారికి వారిలో ఉన్న ప్రతిభలు ఈ శిక్ష ణ శిబిరాల ద్వారా బయటకు వచ్చాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సురేశ్, ఉపాధ్యాయులు జాకీర్ హుస్సేన్, లక్ష్మణ్, తిరుమలేశ్, రాజు, జయరాములు, విద్యార్థులు పాల్గొన్నారు.