Share News

సృజనాత్మకత పెంపొందేలా విద్యాబోధన సాగించాలి

ABN , Publish Date - Jul 02 , 2025 | 11:33 PM

విద్యా ర్థుల్లో సృజనాత్మకత పెంపొందేలా విద్యా బోధన సాగించాలని స్టేట్‌ చైల్డ్‌ రైట్స్‌ ప్రొటె క్షన్‌ కమిషన్‌ చైర్‌పర్స న్‌ సీతాదయాకర్‌ రెడ్డి ఉపాధ్యాయులకు సూ చించారు.

 సృజనాత్మకత పెంపొందేలా విద్యాబోధన సాగించాలి
మాట్లాడుతున్న సీతాదయాకర్‌ రెడ్డి

- స్టేట్‌ చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌ రెడ్డి

బిజినేపల్లి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): విద్యా ర్థుల్లో సృజనాత్మకత పెంపొందేలా విద్యా బోధన సాగించాలని స్టేట్‌ చైల్డ్‌ రైట్స్‌ ప్రొటె క్షన్‌ కమిషన్‌ చైర్‌పర్స న్‌ సీతాదయాకర్‌ రెడ్డి ఉపాధ్యాయులకు సూ చించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను బుధవా రం కమిషన్‌ సభ్యులతో కలిసి పరిశీలించారు. బాలికలకు అందుతున్న పౌష్టి కాహారం, విద్యాబోధన, మౌలిక వసతుల కల్పనను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. లింగవివక్ష లేకుండా మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. పాఠశాల విద్యా భవిష్యత్తుకు పునాదిగా మలుచుకోవాలన్నారు. సమాజంలోని మంచి చెడులపై అవగాహన కల్గి ఉండి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఉన్నత పాఠశాలను ఇంటర్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని త్వరలో ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు, ప్రహరీ, సరిపడ బోధన సిబ్బంది ఉండటంతో పాటు గతేడాది వందశాతం రిజల్ట్స్‌తో పాటు ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అలాగే ఎలాం టి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆమె వెంట కమిషన్‌ సభ్యులు వేదన్‌కుమార్‌, ప్రేమలత అగర్వాల్‌, అపర్ణ, సరిత, వందన, లక్ష్మణ్‌ గౌడ్‌, డీఈవో రమేష్‌కుమార్‌, నాయబ్‌ తహసీల్దార్‌ చిక్కుడు రవికుమార్‌, ఎంఈవో రఘునాథ్‌ శర్మ, జీహెచ్‌ఎం నివేదిత తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 11:33 PM