Share News

విద్యతోనే ప్రగతి

ABN , Publish Date - May 27 , 2025 | 11:15 PM

విద్యతోనే ప్రగతిని సాధించవచ్చని పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

విద్యతోనే ప్రగతి
విద్యార్థినిని సన్మానించి, ప్రశంసాపత్రాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

- బాలికలు చదువును మధ్యలో మానేయొద్దు

- ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

నారాయణపేట న్యూటౌన్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): విద్యతోనే ప్రగతిని సాధించవచ్చని పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లాలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో ప్రతిభ చాటిన ముదిరాజ్‌ విద్యార్థులను, నూతనంగా ఉద్యోగం సాధించిన వారిని, పదోన్నతి పొందిన వారిని ఎమ్మెల్యే సన్మానించడంతో పాటు, అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. మంగళవారం స్థానిక అభినందన్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ముదిరాజ్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ (మెపా) జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్‌నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, మాట్లాడారు. బాలికలు ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షిస్తూ, మధ్యలోనే చదువును ఆపొద్దని సూచించారు. బాలికల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాల ని కోరారు. మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్‌, ముదిరాజ్‌ కమిషన్‌ చైర్మన్‌ బొర్ర జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలన్నారు. డబ్బు ఎంత సంపాదించినా స్థిరంగా ఉండదని, చదువు మాత్రం మన తోనే ఉంటుందన్నారు. అనంతరం ముదిరాజ్‌ సంఘం గౌరవ అధ్యక్షుడిగా సరాఫ్‌ శివకుమార్‌ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నారాయణ పేట జిల్లా అధ్యక్షుడు సరాఫ్‌ నాగరాజ్‌ ఎమ్మెల్యేకు అందించారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర నాయకులు మిర్చి వెంకటయ్య, సంజీవ్‌ ముదిరాజ్‌, సూగప్ప, మత్స్య శాఖ జిల్లా అధ్యక్షుడు కాంత్‌కుమార్‌, నర్సింహనాయుడు, కొనంగేరి హన్మంతు, రాజ్‌కుమార్‌, జులు వెంకటేష్‌, పొలేమోని గోవింద్‌, ఈదప్ప, రాములు, కోలా వెంకటేష్‌ తదితరులున్నారు.

Updated Date - May 27 , 2025 | 11:15 PM