Share News

చదువుతోనే అభివృద్ధి

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:09 PM

చదువుకుంటేనే అభివృద్ధి చెందుతారని, మహిళల విద్య బలోపేతానికి మహాత్మా జ్యోతిబా ఫూలే చేసిన కృషి అపూర్వ మని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అన్నారు.

చదువుతోనే అభివృద్ధి
కలెక్టరేట్‌లో జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, అధికారులు

- మహిళా సాధికారత కోసం జ్యోతిబా ఫూలే కృషి అపూర్వం

- అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

నారాయణపేట టౌన్‌/నారాయణపేట/ నారాయణపేట రూరల్‌/మాగనూరు/ మక్తల్‌/కోస్గి రూరల్‌/ధన్వాడ/కృష్ణ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): చదువుకుంటేనే అభివృద్ధి చెందుతారని, మహిళల విద్య బలోపేతానికి మహాత్మా జ్యోతిబా ఫూలే చేసిన కృషి అపూర్వ మని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 198వ జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజా హాల్‌లో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జ్యోతిబా ఫూలే సాధించిన ఘనత దేశానికి మార్గదర్శకమైందని చదువు కోసం, మహిళా సాధికారత కోసం ఆయన చేసిన కృషి అపూర్వమన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి అబ్దుల్‌ఖలీల్‌, డీపీఆర్‌వో ఎంఏ.రషీద్‌, సీపీవో యోగానంద్‌, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి, రచయిత నరసింహ, గాయ కుడు గౌరీశంకర్‌, రజక సంఘం నాయకులు మడి వాల్‌కృష్ణ, బాల్‌రాజు, నాయీబ్రాహ్మణ సంఘం నాయకుడు సాయిరామ్‌, ముదిరాజ్‌ సంఘం నాయకులు పాల్గొన్నారు.

అదేవిధంగా, పేట సీవీఆర్‌ బంగ్లాలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీం, నాయకులు కోట్ల రవీందర్‌రెడ్డి, రాజిరెడి ్డ, ఎరుకలి వెంకటయ్య, రవికిరణ్‌, వినయ్‌, ఆనంద్‌, శశికిరణ్‌ తదితరులున్నారు. గావ్‌ చలో.. బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు పోషల్‌ వినోద్‌ తొమ్మిదో వార్డు దళితవాడలో పూలే జయంతి వేడుకల్లో పాల్గొని పార్టీ నాయకుడు బాబు మేస్త్రీ ఇంట్లో సహపంక్తి భోజనం చేసి, మాట్లాడా రు. పార్టీ నాయకులు ఆశప్ప, బాబు, భీమ్‌రాజ్‌, లింగరాజ్‌, గజానంద్‌, రాజ్‌ తదితరులున్నారు.

పేట మండలం జాజాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల, మాగనూరు మండలం మందిపల్లి గ్రా మంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థు లు, ఉపాధ్యాయులు జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాజాపూర్‌లో హెచ్‌ఎం భారతి, మందిపల్లిలో హెచ్‌ఎం తిమ్మన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మక్తల్‌ పట్టణంలోని ఎమ్మెల్యే వాకిటి స్వ గృహంలో ఫూలే చిత్రపటానికి కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో, అంబేడ్కర్‌ సంఘం, మహాత్మా జ్యోతిబా ఫూలే సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ బడుగుల అ భ్యున్నతికి కృషి చేసిన గొప్ప మహనీయుడన్నా రు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, గోవిందరాజు, అనిత, రేణుక, విజయలక్ష్మీ, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చిన్నహన్మంతు, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కోస్గి తహసీల్దార్‌ కార్యాలయంలో జ్యోతిబా ఫూలే విగ్రహానికి తహసీల్దార్‌ బక్క శ్రీనివాసులు, పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫూలే చేసిన సేవలను కొనియాడారు. నాయకులు బ్యాగరి రాములు, బసవరాజు, పలు సంఘాల నాయకులు ఉన్నారు.

ధన్వాడ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై జ్యోతిబా ఫూలే చిత్రపటానికి అఖిలపక్ష నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఎంఈవో గాయత్రి, మాధవరెడ్డి, ఎ మ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు చిట్టెం మాధవ రెడ్డి, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.

కృష్ణ మండలంలోని హిందూపూర్‌, ము డుమాల్‌ గ్రామాల్లో అంబేడ్కర్‌ యువజన సం ఘం నాయకుడు బునప్ప తదితరులు జ్యోతిబా ఫూలే, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం నాయకులు అనిల్‌, రాము, మల్లేష్‌, జిందప్ప, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 11:09 PM