చేపల విక్రయంతో ఆర్థికాభివృద్ధి సాధించాలి
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:26 PM
ఉదయం వేళ పచ్చి చేపలు విక్రయించి, సాయంత్రం వేళ చేపల వంటకాలు గ్రామీణ ప్రజలకు విక్రయిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు.
- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ న్యూటౌన్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఉదయం వేళ పచ్చి చేపలు విక్రయించి, సాయంత్రం వేళ చేపల వంటకాలు గ్రామీణ ప్రజలకు విక్రయిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. సోమవారం రాత్రి కలెక్టరెట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారుడికి సంచార చేపల వ్యాన్‌ను అందించారు. దేవరకద్ర నియోజకవర్గం గద్దెగూడెంకు చెందిన అరుణ ఎంపికయ్యారు. ఎంపికైన అరుణకు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క, దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో అందించారు. రాత్రి కలెక్టర్ చేతుల మీదుగా డీఆర్డీవో నర్సింహులు ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబిఽ్ధదారురాలికి బ్యాంకు రుణం రూ.4 లక్షలు ఇప్పించడం జరిగిందన్నారు. రూ.6 లక్షలు సబ్సిడి కింద పేదరిక నిర్మూలన శాఖ భరిస్తుందన్నారు. లబ్ధిదారురాలకు గతంలో (నిథు) ఆధ్వర్యంలో చేపల వంటకాలపై శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఏపీడీ శారద, డీపీఎం రవికుమార్, డీఆవ్వో సీసీ ఎండీ ఖాజఫయాజోద్దీన్ పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో అన్నదానం
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ : నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపం వద్ద సోమవారం కలెక్టర్ విజయేందిర బోయి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ పాల్గొన్నారు.