Share News

భక్తిశ్రద్ధలతో ఈస్టర్‌ వేడుకలు

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:38 PM

జిల్లా వ్యాప్తంగా అదివారం ఈస్టర్‌ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణం లోని ఎంబీ చర్చి, అశోక్‌నగర్‌, బీసీ కాలనీ చర్చి లతో పాటు మండలంలోని భైరంకొండ, కొల్లం పల్లి, సింగారం గ్రామాల్లోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

భక్తిశ్రద్ధలతో ఈస్టర్‌ వేడుకలు
నారాయణపేట చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవులు

నారాయణపేట, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా అదివారం ఈస్టర్‌ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణం లోని ఎంబీ చర్చి, అశోక్‌నగర్‌, బీసీ కాలనీ చర్చి లతో పాటు మండలంలోని భైరంకొండ, కొల్లం పల్లి, సింగారం గ్రామాల్లోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సింగారం గ్రామంలో ఉద యం ప్రభువును స్మరిస్తూ పాటలు పాడుతూ ర్యాలీగా బయలుదేరి కల్వరికొండకు చేరుకొని అక్కడ ఉదయకాల ఆరాధన కార్యక్రమం నిర్వ హించి ప్రార్థనలు చేశారు. అనంతరం ఇమ్మా న్యుయల్‌ చర్చిలో పాస్టర్‌ నగేష్‌ మాట్లాడుతూ ప్రభువు మరణాన్ని జయించి సమాధి నుంచి మృత్యంజయుడిగా వచ్చిన దినాన్నే ఈస్టర్‌ అని ఇది ఒక పర్వదినంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారన్నారు వినోద్‌, ఆనంద్‌, తిమొతి, రత్నయ్య, పరంజ్యోతి, దేవపుత్ర, సుధాకర్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:38 PM