నేటి నుంచి దసరా సెలవులు
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:36 PM
విద్యా సంస్థలకు ఆదివారం నుంచి అక్టోబరు 3 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. దాంతో గురుకులాలు, కేజీబీవీలు, సాంఘిక సం క్షేమ హాస్టళ్లు, ప్రైవేటు హాస్టళ్లలో ఉం టున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు.
ఇంటిబాట పట్టిన విద్యార్థులు
పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు: విద్యాశాఖ
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/ నారాయణపేట, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యా సంస్థలకు ఆదివారం నుంచి అక్టోబరు 3 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. దాంతో గురుకులాలు, కేజీబీవీలు, సాంఘిక సం క్షేమ హాస్టళ్లు, ప్రైవేటు హాస్టళ్లలో ఉం టున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. విద్యార్థులు తల్లిదండ్రులు, సంరక్షకులతో కలిసి ఇళ్లకు వెళ్లారు. దాంతో మహబూబ్‌నగర్, నారాయణపేట బస్టాండ్లు సందడిగా మారాయి.
తల్లిదండ్రుల సమావేశాలు
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన, నాణ్యమైన భో జనం, వసతుల గురించి ప్రధానోపాధ్యాయులు వివరించారు. విద్యార్ధులను ఇంటిదగ్గర బాగా చదివించాలని చెప్పారు.
పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు
బతుకమ్మ సంబరాలు ఒక రోజు ముందుగానే పాఠశాలల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన విద్యార్థినులు వివిధ రకాల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో ఆటపాటలు ఆడారు. దాంతో విద్యా సంస్థల వద్ద సందడి నెలకొంది.