బాలుర జూనియర్ కళాశాలలో దసరా ఉత్సవాలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:31 PM
నగరంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో దసరా ఉత్సవాలను అక్టోబరు 2న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దసరా ఉత్సవ సమితి నాయకులు స్పష్టం చేశారు.
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో దసరా ఉత్సవాలను అక్టోబరు 2న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దసరా ఉత్సవ సమితి నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం ఆర్యసమాజ్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఉత్సవ సమితి సభ్యులు చర్చించారు. దసరా రోజు సాయంత్రం 4 గంటలకు ఆర్యసమాజ్ నుంచి ధ్వజధారి శోభాయాత్ర ప్రారంభం అవుతుందని, దసరా కట్టమీదుగా గడియారం చౌరస్తా, రాజీవ్ చౌరస్తా, బస్టాండ్ మీదుగా బాలుర జూనియర్ కళాశాల మైదానం వద్దకు చేరుకుంటుందన్నారు. అక్కడే బాణసంచా రావణ దహనం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. హిందూబంధువులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, ఉత్సవ సమితి నాయకులు డా.మురళీధర్, చంద్రయ్య, చంద్రకుమార్, రామాంజనేయులు, నాగేశ్వర్‌రెడ్డి, బురుజు సుధాకర్‌రెడ్డి, అచ్చుగంట్ల అంజయ్య, గోపాల్‌యాదవ్, మాల్యాద్రిరెడ్డి, లక్ష్మణ్, రాంచంద్రయ్య, మోహన్‌యాదవ్, సురేందర్‌రెడ్డి, రమేశ్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.