Share News

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు బకాయిలు చెల్లించాలి

ABN , Publish Date - May 30 , 2025 | 11:25 PM

ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గోపాల్‌, మోహన్‌ డిమాండ్‌ చేశారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు బకాయిలు చెల్లించాలి
తెలంగాణ చౌరస్తాలో ఆందోళన చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు

పాలమూరు, మే 30 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గోపాల్‌, మోహన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టి తెలంగాణ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ కార్యా లయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ పట్టణ ప్రాంత కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. కొత్త జాబ్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీలు రాక పస్తులు ఉంటున్న పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. మూడోసారి అ ధికారంలోకి వచ్చిన బీజేపీ ఉపాధి హామీ కూలీలకు పనిదినాలను తగ్గించి, జాబ్‌కార్డులను పెద్ద ఎత్తున కోత విధించిందన్నారు. కార్యక్ర మంలో ఆంజనేయులు, హన్మంతు, భగవంతు, రాములు, శివలీల, వెంకటయ్య, సాయిలు, చంద్రశేఖర్‌, వెంకటయ్య, మొగులయ్య, కొండ య్య, మంజుల పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:25 PM