ప్రియాంక బలవన్మరణంపై డీఎస్పీ విచారణ
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:37 PM
గట్టు మండల పరిదిలోని చిన్నోనిపల్లి గ్రామాన్ని గద్వాల డీఎస్సీ మొగులయ్య ఆదివారం విచారణ చేపట్టారు. చిన్నోనిపల్లికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్‌గౌడు నమ్మించి మోసం చేయడంతో కొత్త గూడెం జిల్లా పాల్వచంకు చెందిన యువతి ప్రియాంక (32) మనస్తాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.
గట్టు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): గట్టు మండల పరిదిలోని చిన్నోనిపల్లి గ్రామాన్ని గద్వాల డీఎస్సీ మొగులయ్య ఆదివారం విచారణ చేపట్టారు. చిన్నోనిపల్లికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్‌గౌడు నమ్మించి మోసం చేయడంతో కొత్త గూడెం జిల్లా పాల్వచంకు చెందిన యువతి ప్రియాంక (32) మనస్తాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించి విచారణలో భాగంగా డీఎస్పీ మొగులయ్య, మి ట్టదొడ్డి గ్రామంతో పాటు చిన్నోనిపల్లి గ్రామాన్ని సందర్శించి ప్రియాంక ఉన్న ఇంటి పరిసరాలను పరిశీలించారు. అనంతరం చిన్నోనిపల్లి గ్రామస్థులతో పలు విషయాలను తెలుసుకున్నారు. డీఎస్సీ వెంట ఎస్‌ఐ కేటీ మల్లేష్ తదితరులు ఉన్నారు.