Share News

ఎండుతున్న గొంతులు

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:03 PM

వేసవికి ముందే ఎండలు ముదురుతున్నాయి..

ఎండుతున్న గొంతులు
నీటి సరఫరా పైప్‌లైన్‌ మరమ్మతు చేస్తున్న కార్మికులు (ఫైల్‌)

దేవరకద్ర వద్ద కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. పైప్‌లైన్‌ లీకేజీ

- నారాయణపేటలో నాలుగు రోజులుగా నిలిచిన నీటి సరఫరా

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : వేసవికి ముందే ఎండలు ముదురుతున్నాయి.. దీంతో తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో దేవరకద్ర వద్ద పైప్‌లైన్‌ లీకేజీ కావడంతో ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోవంతో ప్జలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కరోజు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆర్‌బ్ల్యూఎస్‌ శాఖ తెలపగా, తీరా మరమ్మతు చేపట్టే చోట ఇళ్ల నిర్మాణం చేపట్టడం. అక్కడ 11 కేవీ విద్యుత్‌ లైన్లు ఉండడంతో మరమ్మతు చేపట్టడానికి రెండు రోజులు పట్టింది. మరమ్మత్తు చేపట్టాక విద్యుత్‌ అధికారులు లైన్‌ బ్రెక్‌ చేయకపోవడం వల్ల మరో రెండు రోజులు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి నారాయణపేటకు నాలుగు రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నేటి సాయంత్రానికి తాగునీటి సరఫరా అవుతఅధికారులు వెల్లడించారు. కాంట్రాక్టర్లే మరమ్మత్తు చేపట్టాల్సి ఉండగా జాప్యం జరుగుతుంది. (డీఎల్‌పీ) డిఫెక్ట్‌ లెవలబుల్‌ పిరియడ్‌ కాలం మొత్తం ఎక్కడ లీకేజీ ఉన్నా.. పైప్‌లైన్‌ నిర్మాణ పనులు చేపట్టిన సంస్థనే మరమ్మతు చేపట్టాల్సి ఉంటుంది. అధికారులు కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తారు.

రిజార్వాయర్లలో నీరు పుష్కలం..

మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సాగునీరు అందించే ఎల్లూరు, కోయిల్‌సాగర్‌ రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉన్నాయి. కానీ లీకేజీలతోనే తాగునీరు ఇబ్బందులు తలెత్తున్నాయి.

విడుదల కాని నిధులు..

ఏటా ప్రభుత్వం నుంచి ఆర్‌డబ్లూఎస్‌ శాఖ వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుంది. కానీ నేటికి నిధులు మంజూరు కాకపోవడంతో అధికారులు మరమ్మతు చేపట్టలేకపోతున్నారు. కాగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం, లింగాల మండలాల పరిధిలో 16 గ్రామాల్లో అధికారులు రవాణా ద్వారా తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.

రూ.10 కోట్లు నిధులు రావల్సి ఉంది..

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు సర్కిల్‌ పరిధిలోని మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు రూ.10 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ఇండెంట్‌ పెట్టడం జరిగింది. వచ్చేవారం నిధులు విడుదల కావచ్చు. ఎక్కడైన తాగునీటి సమస్య వస్తే వ్యవసాయ బోర్లు కూడా లీజుకు తీసుకోమని ఈఈలకు ఆదేశాలు జారీ చేశాం. సమస్యాత్మక ప్రాంతాల్లో రవాణా ద్వారా సరఫరాకు సిద్ధం చేస్తున్నాం.

హెచ్‌.జగన్‌మోహన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ

Updated Date - Mar 11 , 2025 | 11:03 PM