తాగిన మత్తులో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి హల్‌చల్
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:55 PM
తాగిన మద్యం మత్తులో ఓ యువ కుడు సబ్‌స్టేషన్‌లోకి దూసుకుపోయి ట్రాన్స్ ఫార్మర్‌పైకి ఎక్కి హల్‌చల్ చేశాడు. దీంతో ఆపరేటర్ వెంటనే తేరుకొని విద్యుత్ సరఫ రా నిలిపి వేయడంతో కాలిన గాయాలతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
- కొల్లాపూర్‌లో ఒడిస్సా యువకుడి నిర్వాకం
- గంట పాటు విద్యుత్ అంతరాయం
- యువకుడిని బంధించి కిందికి దింపిన ఏఈ ఉమేష్ గౌడ్
కొల్లాపూర్, సెప్టెంబరు 24 (ఆంధ్ర జ్యోతి): తాగిన మద్యం మత్తులో ఓ యువ కుడు సబ్‌స్టేషన్‌లోకి దూసుకుపోయి ట్రాన్స్ ఫార్మర్‌పైకి ఎక్కి హల్‌చల్ చేశాడు. దీంతో ఆపరేటర్ వెంటనే తేరుకొని విద్యుత్ సరఫ రా నిలిపి వేయడంతో కాలిన గాయాలతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వి వరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లా పూర్ పట్ట ణంలోని చౌటబెట్ల రహదారిలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లోకి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన యువకుడు బుధవారం రాత్రి 9 గంటలకు తాగిన మత్తులో వెళ్లాడు. చకచకా ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కాడు. షార్ట్ సర్క్యూట్ అయ్యి వ చ్చిన నిప్పురవ్వలతో యువకుడి శరీరం పూ ర్తిగా కాలిపోయింది. అయినా మొండిపట్టు తో కిందికి దిగకుండా గంట పాటు అందరి ని ఆశ్చర్యపరిచాడు. కొల్లాపూర్ ఎస్‌ఐ హృ షికేష్ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలా నికి చేరుకుని కిందికి దిగా లని బతిమిలాడిన వినలే దు. అతని చేతిలో ఉన్న కర్రలతో కింద ఉన్న పో లీసులపై విద్యుత్ సిబ్బం దిపైకి దాడి చేశాడు. ఫ పోలీసులతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప ట్టణ ప్రజలంతా యువ కుడిని కిందికి దిగాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. చివరికి ట్రాన్స్‌కో ఏఈ ఉమేష్ గౌడ్ సంఘటన స్థలానికి చేరు కుని సిబ్బందితో కలిసి యువకుడిని కింది కి దింపే ప్రయత్నం చేశారు. అయినా ఫలి తం లేకపోవడంతో ఏఈ ధైర్య సాహసం ప్రదర్శిస్తూ తానే స్వయంగా చీకటిలో ట్రా న్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి యువకుడి వద్దకు చేరు కున్నాడు. ఈ క్రమంలో యువకుడు ఏఈ పై కాళ్లతో దాడి చేసినా బెదరకుండా అలా గే యువకుడిని ఒంటి చేత్తో గట్టిగా బం ధించాడు. వెంటనే విద్యుత్ సిబ్బంది అంతా యువకుడు వద్దకు వెళ్లి అతన్ని తాళ్లతో బంధించి కిందికి దింపారు. దీంతో అక్కడు న్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏఈ ఉమేష్ గౌడ్ ధైర్య సాహసాన్ని చూసి అక్క డున్న వారంతా ప్రశంసించారు. యువకుడి ని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చి వైద్యం అందించారు. కేసు దర్యాప్తు నిర్వ హిస్తున్నట్లు ఎస్‌ఐ హృషికేష్ తెలిపారు.