మాదకద్రవ్యాల నియంత్రణ ప్రతీ పౌరుడి బాధ్యత
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:21 PM
మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయని, వాటి నియంత్రణ ప్రతీ పౌరుడి బాధ్యత అని జిల్లా న్యాయమూర్తి బి పాపిరెడ్డి అన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో గురువారం ర్యాలీ నిర్వహించారు.
జిల్లా న్యాయమూర్తి బి పాపిరెడ్డి
పాలమూరులో అవగాహన ర్యాలీ
మహబూబ్‌నగర్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయని, వాటి నియంత్రణ ప్రతీ పౌరుడి బాధ్యత అని జిల్లా న్యాయమూర్తి బి పాపిరెడ్డి అన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. పోలీస్, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో స్టేడియం మైదానం నుంచి తెలంగాణ చౌ రస్తా వరకు అవగాహన ర్యాలీ చేశారు. పాపిరెడ్డి కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ జానకిలతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రా రంభించారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ కళాశాలల్లో విద్యార్థులు, యువత డ్రగ్స్ బారిన పడకుండా వాటిని అరికట్టాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించాలని సూచించారు. కలెక్టర్ విజయేందిరబోయి మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్, వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి డ్రగ్స్ ఫ్రీ సొసైటీగా మార్చాల్సిన అసవరం ఉందన్నారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదంటే 1908 నెంబర్‌లకు ఫోన్ చేయాలని కోరారు. అనంతరం స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. సందర్భంగా డ్రగ్స్ నియంత్రణపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనాబేగం, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఇందిర, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌కుమార్, రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ నటరాజ్ పాల్గొన్నారు.