Share News

కొత్తపాలెం తండాలో తాగునీటి ఎద్దడి

ABN , Publish Date - Jun 03 , 2025 | 11:27 PM

మండ ల పరిధిలోని కొత్తపాలెం తండాలో ఐదు రో జులుగా మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. దీంతో తండావాసులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు.

కొత్తపాలెం తండాలో తాగునీటి ఎద్దడి
వ్యవసాయబోరు నుంచి బిందెలతో తాగునీటిని తెచ్చుకుంటున్న కొత్తపాలెం తండావాసులు

ధరూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): మండ ల పరిధిలోని కొత్తపాలెం తండాలో ఐదు రో జులుగా మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. దీంతో తండావాసులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. పైప్‌లు లీకేజీ కార ణంగా నీరు రాకపోవడంతో తండా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల వరకు నడిచి వె ళ్లి వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుం టున్నారు. తండాలో బోరు వేస్తే తమకు ఈ ఇబ్బందులు ఉండవని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. అధికారులు, స్థానిక నాయకులు స్పం దించి బోరు వేయించాలని కోరుతున్నారు.

Updated Date - Jun 03 , 2025 | 11:27 PM