Share News

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:26 PM

ఇళ్లస్థలాలు కోల్పోయిన ప్రతీ పేదవారికి డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇ వ్వాలని, స్థలం లేని ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ గేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి
కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం నాయకుల ధర్నా

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : ఇళ్లస్థలాలు కోల్పోయిన ప్రతీ పేదవారికి డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇ వ్వాలని, స్థలం లేని ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ గేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సీపీఎం రాష్ట్ర నాయకురాలు విజయలక్ష్మి, పట్టణ కార్యదర్శి చంద్రకాంత్‌, కమిటీ సభ్యులు మోహన్‌, రాజకుమార్‌, విష్ణు, ఖమర్‌అలీ, నవాబ్‌ఖాన్‌ ఉన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 11:26 PM