Share News

రైతులు నష్టపోతున్నా పట్టించుకోరా?

ABN , Publish Date - May 19 , 2025 | 11:23 PM

మా వడ్ల బస్తాలను ప్రభుత్వం కొని దాదాపు 10, 15రోజు లు గడుస్తున్నా వాటిని తరలించకుండా ఐకేపీ కేంద్రంలోనే ఉంచి తాము నష్టపోయేలా చేస్తు న్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులు నష్టపోతున్నా పట్టించుకోరా?

- ఐకేపీ కేంద్రం వద్ద రైతుల ధర్నా

మల్దకల్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): మా వడ్ల బస్తాలను ప్రభుత్వం కొని దాదాపు 10, 15రోజు లు గడుస్తున్నా వాటిని తరలించకుండా ఐకేపీ కేంద్రంలోనే ఉంచి తాము నష్టపోయేలా చేస్తు న్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని నిరసిస్తూ సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండల పరిధిలో గల గద్వాల- అయిజ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారుమాట్లాడుతూ ఇటీవల వరుసగా కురుస్తున్న అకాలవర్షాలకు వడ్డ బస్తాలు తడిసిపోతున్నాయని, వాటిని తరలించడంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తు న్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాలు తడిసి మొలకలు వచ్చే ప్రమాదం ఉం దని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతామన్నా రు. ఒక బస్తాకు కేజీ తరుగు అని చెప్పి, ప్రస్తు తం క్వింటాలుకు నాలుగు నుంచి ఐదు కేజీల తరుగు తీస్తున్నామని అధికారులు రైతులకు స మాచారం ఇవ్వడం ఎంతవరకు సబబని ప్ర శ్నించారు. ఈవిషయమై ఐకేపీ సెంటర్‌ అధికా రులను సంప్రదించగా, బస్తాలు లోడ్‌ చేయడా నికి లారీల కొరత ఉన్నందున వాటిన తరలించ లేక పోతున్నామని అధికారి కిరణ్‌కుమార్‌ తెలి పారు. త్వరలోనే వాటిని లోడ్‌ చేస్తామని, క్విం టాలుకు నాలుగు నుంచి ఐదు కేజీల తరుగు నిజంకాదని, ఆ విధంగా మాకు పైఅధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. బస్తా ల తూకంపై కొద్దిగా తేడా ఉన్నందున జాప్యం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నీతువానిప ల్లితండా, మద్దెలబండతండా, కుర్తిరావులచెరు వు, మల్దకల్‌ గ్రామాల రైతులు ఉన్నారు.

Updated Date - May 19 , 2025 | 11:23 PM