చిన్న పొరపాటూ జరుగొద్దు
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:08 PM
మూడో విడత గ్రామ పం చాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌లను పకడ్బందీగా నిర్వహించాలని మహబూబ్‌నగర్ క లెక్టర్ విజయేందిరబోయి ఆదేశించారు. చిన్న పొరపాటు కూడా జరుగొద్దని చెప్పారు.
మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిరబోయి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మూడో విడత గ్రామ పం చాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌లను పకడ్బందీగా నిర్వహించాలని మహబూబ్‌నగర్ క లెక్టర్ విజయేందిరబోయి ఆదేశించారు. చిన్న పొరపాటు కూడా జరుగొద్దని చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి మూడో విడత ఎన్నికల పోలింగ్, కౌం టింగ్‌లపై జడ్చర్ల, బాలానగర్, భూత్పూర్, అ డ్డాకుల, మూసాపేట మండలాల జోనల్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులతో వెబెక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తప్పులకు ఆస్కారం లేకుండా పోలింగ్, కౌంటింగ్ నిర్వహించాలన్నారు. పో లింగ్ ముగిశాక మఽధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను చేపట్టాలన్నారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించాలన్నారు. రిసెప్షన్ సెంటర్లలో మెటీరియల్ సరి చూసుకోవాలన్నారు. పోలింగ్‌ను సవ్యంగా నిర్వహించేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మొదటి, రెండు విడతల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారని, మూడో విడత కూడా సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, జడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, ఆర్‌డీవో నవీన్ పాల్గొన్నారు.