మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోవొద్దు
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:33 PM
రైతు లు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని అలం పూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
అయిజ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రైతు లు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని అలం పూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలోని కిసాన్‌నగర్, రాజాపూర్, బైనపల్లి గ్రామాల్లో మహిళా సం ఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రా రంభమయ్యాయి. ఈకార్యక్రమానికి ముఖ్యఅతి థిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం మా ట్లాడారు. రైతుల పంట దిగుబడిని మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నా రు. ఇక్కడ ఎలాంటి మోసాలు జరగవని తెలిపారు. బయట తూకాల్లోను, ధరలోను మోసా లు ఉంటాయని రైతులకు తెలిపారు. రూ.500 బోనస్ సైతం అందిస్తుందని వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన తేమ మేరకు ఽధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల్సిందిగా సూచించారు. ఇక్కడ ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమములో డీపీఎం అరుణ, ఏపీఎం భీమన్న, జయాకర్, సీసీలు సుదర్శన్, ఆంజనేయులు, బీఆర్‌ఎస్ నాయకులు రంగారెడ్డి, నర్సింహరెడ్డి, రమేష్, ముక్తర్ పాల్గొన్నారు.