Share News

రోడ్లపై వర్షం నీరు నిలవొద్దు

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:21 PM

జడ్చర్ల పట్టణంలో రోడ్లపై వర్షం నీళ్లు నిలువకుండా, రాబోయే 20 సంవత్సరాల వరకు సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

రోడ్లపై వర్షం నీరు నిలవొద్దు
క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

- అధికారుల సమీక్షలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జడ్చర్ల పట్టణంలో రోడ్లపై వర్షం నీళ్లు నిలువకుండా, రాబోయే 20 సంవత్సరాల వరకు సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఇరిగేషన్‌, విద్యుత్‌, వ్యవసాయ, రెవెన్యూ, మునిసిపల్‌, ప్రజా ఆరోగ్యం శాఖల అధికారులతో సోమవారం అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిధులు తెచ్చే బాధ్యత తనదని, పనులను చేపట్టే బాధ్యత అధికారులదేనని అన్నారు. చెరువు, కుంటల కట్టలు బలహీనపడి తెగిపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని ఇరిగేషన్‌, విద్యుత్‌ ప్రమాదాలు జరుగకుండ పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ అధికారులకు ఆదేశించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను తక్షణం తనకు తెలుపాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయని, వర్షాలు మరికొన్ని రోజులు పడితే బలహీనంగా ఉన్న చెరువులు, కుంటల కట్టలు తెగిపోయి నీళ్లన్ని వృథాగా పోయే ప్రమాదం ఉందని, వాటి వివరాలను తెలుపాలన్నారు. జడ్చర్ల మునిసిపాలిటీలోని నల్లకుంట, నల్ల చెరువు, ఊర చెరువుకు నీళ్లు వెళ్లే ఛానల్స్‌ను పునరుద్ధరించాలని సూచించారు. ఫీడర్‌ ఛానల్స్‌ ఆక్రమణలకు గురైన చోట వెడల్పు చేయాలన్నారు. చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ల పరిధిలో ఎక్కడైనా, ఎవరైనా ప్లాట్లు చేస్తే నిర్మొహమాటంగా తొలగించాలని స్పష్టం చేశారు. విద్యుత్‌ ప్రమాదాలు జరుగకుండా రూ.11 కోట్లతో సేఫ్టీ బడ్జెట్‌ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని అధికారులు చెప్పగా, నిధులను మంజూరు చేయాలని విద్యుత్‌శాఖ సీఎండీతో ఫోన్‌లో మాట్లాడారు.

Updated Date - Aug 18 , 2025 | 11:21 PM