Share News

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:32 PM

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు వరి, పత్తి, మొక్కజొన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా సంబంధిత అధి కారులు తగిన చర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు

  • జోగుళాంబ గద్వాల కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు వరి, పత్తి, మొక్కజొన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా సంబంధిత అధి కారులు తగిన చర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. శనివారం కలెక్టర్‌ కా ర్యాలయంలోని సమావేశ మందిరంలో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పత్తి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు నాణ్యతలేదని తిప్పి పంపే పరిస్థితి ఏర్పడకుండా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సీసీఐ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల రైతుల కు అవగాహన కల్పించాలన్నారు. రంగు మారిన పత్తి, తేమశాతం 8 నుంచి 12 శాతం ఉండేలా చూసుకున్న పిదప పత్తి కొనుగోలు కేంద్రాలకు పంపించే విధంగా చూడాలన్నారు. నాణ్యతలేని పత్తిని సీసీఐ తిరస్కరించడం వల్ల రైతులు అ సౌకర్యానికి గురి అరవుతున్నారని అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం వర్షాలు కూడా తగ్గుముఖం పట్టినందున వచ్చే రెండు నెలలు రైతులకు అసౌకర్యం కలుగకుండా, జాగ్రత్తగా కొనుగోలు ప్రక్రియ జరిగేలా చూడాలన్నా రు. మొక్కజొన్న సేకరణకు ఇప్పటికే మానవపా డు, క్యాతూరు వద్ద కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించామని, మరో రెండు కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేస్తామన్నారు. మొక్కజొన్న మద్ద తు ధర క్వింటాకు రూ.2,400 అందించనున్నామ ని, 14శాతం తేమ ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌, వ్యవసాయ సహాయ సంచాలకులు సంగీతలక్ష్మి, ఉద్యానవన శాఖ అఽధికారి అక్బర్‌బాషా, డీఎస్‌వో స్వామికుమార్‌, సంబంధిత అధికారులు ఉన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:32 PM