పత్తి కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు
ABN , Publish Date - Nov 06 , 2025 | 10:57 PM
పత్తి విక్రయానికి వచ్చిన రైతులకు ఇబ్బందులు లే కుండా సీసీఐ కొనుగోళ్లు అధికారులు చర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు.
జిన్నింగ్ మిల్లును పరిశీలించిన జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పత్తి విక్రయానికి వచ్చిన రైతులకు ఇబ్బందులు లే కుండా సీసీఐ కొనుగోళ్లు అధికారులు చర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. గురువారం మండలంలోని కొండపల్లి రోడ్డులో గల బాలాజీ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లును ఆయన పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రైతులు పత్తిని ఆరబెట్టి తీసుక వస్తే తేమశాతం తగ్గి మంచి గిట్టుబా టు ధర వస్తుందని సూచించారు. పత్తిని పూ ర్తిస్థాయిలో కొనుగోళ్లు చేయడానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందని రైతులు ఇబ్బందులు పడవద్దని సూచించారు. ఒక ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున సీసీఐ కొనుగోలు చేస్తుందని వివరించారు. స్లాట్ బుకింగ్ రిజిస్ర్టేషన్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పత్తి పంట వేసేటప్పుడే రైతులు, వ్యవసాయ అధికారులు సరిగ్గా వివరాలను నమోదు చేస్తే ఈ పరిస్థితి రాదని వివరించారు. త్వరంలో మరోకొనుగోలు కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తామని వివరించారు. కాగా గద్వాలలో ప్రస్తుతం 1350 క్వింటాళ్ల కెపాసిటీ ఉన్న మిల్లులను రెండువేల క్వింటాళ్లకు పెంచాలని యాజమాన్యం కోరడంతో దానిని 1800 క్విం టాళ్ల వరకు పెంచేందుకు అవకాశం కల్పించాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, సీసీఐ ఇన్‌చార్జి రాహుల్ కలేనా, మార్కెట్ కార్యదర్శి నరసింహ ఉన్నారు.