Share News

దళారుల చేతిలో మోసపోవద్దు

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:15 PM

రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మో సపోవద్దని,

దళారుల చేతిలో మోసపోవద్దు

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

వనపర్తి రూరల్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మో సపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్ర యించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి వ్యవసాయ మా ర్కెట్‌ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మా ట్లాడారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొ నుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. సన్న రకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందజేస్తుందని అ న్నారు. రైతులు ఎలాంటి ఆందోళన లే కుండా తమ పంటను సమీప కొను గోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

Updated Date - Nov 02 , 2025 | 11:15 PM