విద్యానిధికి రూ.10 లక్షలు విరాళం
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:05 PM
: మహబూబ్‌నగర్ విద్యానిధికి జిల్లా టీఎన్‌జీవో(తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల) ఫోరం నుంచి రూ.10,69,700 విరాళాన్ని బుధవారం అందించారు. అందుకు సంబంధించిన చెక్కును బుధవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ విజయేందిర బోయికి అందించారు.

అందించిన టీఎన్‌జీవో ఫోరం
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ విద్యానిధికి జిల్లా టీఎన్‌జీవో(తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల) ఫోరం నుంచి రూ.10,69,700 విరాళాన్ని బుధవారం అందించారు. అందుకు సంబంధించిన చెక్కును బుధవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ విజయేందిర బోయికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ మహబూబ్‌నగర్ విద్యానిధికి వచ్చిన ప్రతి పైసా పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి, వారి పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కు ఖర్చు చేస్తామన్నారు. టీఎన్‌జీవో ఫోరం తరఫున రూ.10 లక్షల పైచిలుకు అందించడం అభినందనీయమన్నారు. ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజీవ్‌రెడ్డి, చంద్రనాయక్, ఫోరంలోని 200 మంది ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ విద్యానిధికి తాను ప్రతీ నెల తన జీతంలో రూ.లక్ష ఇస్తున్నట్లు తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంటు వారు ఎస్పీ ఆధ్వర్యంలో రూ.3 లక్షల చెక్కును అందించారన్నారు. కలెక్టర్ విజయేందిర బోయి తనవంతు సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. పీఆర్‌టీయూ కూడా విరాళం అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. విద్యావంతులు, మేధావులు, వ్యాపారవేత్తలు ముందుకు రావాలన్నారు. మంచి అనేది మనుషుల్లో కను మరుగు కాలేదని ఈ రోజు నిరూపణ అయ్యిందన్నారు. అంతకు ముందు టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ మీరిచ్చిన పిలుపుతోనే 200 మంది ఉద్యోగులు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారన్నారు. టీఎన్‌జీవో నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎస్ మోహన్‌రావు, శివేంద్ర ప్రతాప్, టీపీసీసీ కార్యదర్శి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.