రక్తదానంతో మరొకరికి ప్రాణదానం : ఎస్పీ
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:54 PM
రక్తదానం చేయడంతో మరోకరికి ప్రాణదానం చేసినవారం అవుతామని ఎస్పీ డి.జానకి అన్నారు.
రాజాపూర్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : రక్తదానం చేయడంతో మరోకరికి ప్రాణదానం చేసినవారం అవుతామని ఎస్పీ డి.జానకి అన్నారు. శనివారం అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా, బ్లడ్ సెంటర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మహబూబ్‌నగర్ సమక్షంలో మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జడ్చర్ల రూరల్ సర్కిల్ పరిధిలోని రాజాపూర్, బాలానగర్, మిడ్జిల్‌కు చెందిన యువకులు, పోలీస్ సిబ్బంది, ఎస్‌ఐలు 85 యూనిట్ల రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ భద్రత కల్పిస్తు, సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందంజలో ఉంటుందన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, ఎస్‌ఐలు శివానందంగౌడ్, లెనిన్‌గౌడ్, శివనాగేశ్వర నాయుడు పాల్గొన్నారు.