Share News

రక్తదానం మరొకరికి ప్రాణదానం

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:42 PM

రక్తదానంతో మరొకరికి ప్రాణం నిలబడుతోందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు.

 రక్తదానం మరొకరికి ప్రాణదానం
జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌

- మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : రక్తదానంతో మరొకరికి ప్రాణం నిలబడుతోందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు. మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఫలక్‌నూమలో ఆదివారం జరిగిన రహమతుల్‌ లిల్‌ ఆలమీన్‌ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనడానికి బజ్మె ఖాద్రియా కాజ్మియా జిల్లా అధ్యక్షుడు జహంగీర్‌పాష ఖాద్రీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం నుంచి వెళ్లే ప్రత్యేక బస్సును ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను పురస్కరించుకొని ప్రతీ ఏడాది రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు. మనం చేసే రక్తదాన శిబిరం ప్రాణపాయ స్థితిలో ఉన్న మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్‌హదీ, జాకీర అడ్వకేట్‌, నాయకులు సాదుల్లా హుస్సేనీ, మీర్‌ షోయబ్‌అలీ, జమీర్‌ఖాద్రీ, ఉమర్‌కొత్వాల్‌, గులాం అహ్మద్‌, జహీర్‌, అజ్మత్‌అలీ, బజ్మె ఖాద్రియా కాజ్మియా జిల్లా అధ్యక్షుడు జహంగీర్‌పాష ఖాద్రీ, ప్రతినిధులు సయ్యద్‌ అబ్దుల్‌ ఖుద్దుస్‌, ఖాజామోయినద్దీన్‌, మహ్మద్‌ ఇలియాజ్‌, ముజహిద్‌, తన్వీర్‌, మోసీన్‌, అలీం, అసద్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 11:42 PM