Share News

వైద్యులు అందుబాటులో ఉండాలి

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:21 PM

వైద్య, ఆరోగ్యశాఖ వైద్యులు, సిబ్బంది ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ సూచించారు.

వైద్యులు అందుబాటులో ఉండాలి
బిజినేపల్లి పీహెచ్‌సీలో మందులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

బిజినేపల్లి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : వైద్య, ఆరోగ్యశాఖ వైద్యులు, సిబ్బంది ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ సూచించారు. బిజినేపల్లి ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రాన్ని ఆయన బుధవారం తనిఖీ చేశారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఎన్ని డెలివరీలు, వైద్య పరీక్షలు చేశారని వైద్యాధికారి డాక్టర్‌ శివకుమార్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువగా నిరుపేదలు వస్తుంటారని, వారికి 24 గంటలు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం పీఏసీఎస్‌ గోదాంలోని ఎరువుల నిల్వలు, పంపిణీ వివరాలను పరిశీలించారు. రైతులకు అవసరమైన ఎరువులు నిల్వ ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో డీఏవో యశ్వంత్‌ రావు, ఇన్‌చార్జీ ఏవో కమల్‌ కుమార్‌, సీఈవో రవీందర్‌, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 11:21 PM