గూడ్స్ వాహనాల్లో ప్రజలను తరలించొద్దు
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:17 PM
పట్టణ పరిసరాల్లో రూరల్ ఎస్‌ఐ రాముడు ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు.
- రూరల్ ఎస్‌ఐ రాముడు
నారాయణపేట టౌన్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పరిసరాల్లో రూరల్ ఎస్‌ఐ రాముడు ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. రూరల్ ప్రాంతాలలో కూలీలను తరలిస్తున్న 8 గూడ్స్ ఆటోలు, బొలెరొ వాహనాలను పట్టుకుని జరిమానా విధించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ గూడ్స్ వాహనాలలో చిన్న పిల్లలను, కూలీలను రవాణా చేయడం నేరమన్నారు. డ్రైవర్లు గూడ్స్ వాహనాలలో వ్యక్తులను తరలిస్తే సీజ్ చేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రమాదాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు.