Share News

నీటి ప్రవాహాల వద్దకు వెళ్లొద్దు

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:23 PM

వర్షాలు కురుస్తున్న కారణంగా చెరువులు, వాగులు నిండి లోలెవల్‌ కాజ్‌వేలు, ప్రధాన రహదారులపై నీటి ప్రవాహాల వద్దకు ఎవరూ వెళ్లొద్దని కలెక్టర్‌ విజయేందిర బోయి చెప్పారు. జడ్చర్ల మండలం కిష్టారం, అంబటాపురం గ్రామాల మధ్య రోడ్డుపైకి చేరిన పోతిరెడ్డి చెరువు నీటిలో భార్యా భర్తలు గల్లంతయిన ప్రాంతాన్ని కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు.

నీటి ప్రవాహాల వద్దకు వెళ్లొద్దు
గల్లంతైన భార్యా భర్తలు తానెంబాలయ్య, రాములమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయేందిరబోయి

కలెక్టర్‌ విజయేందిర బోయి

భార్యాభర్తలు గల్లంతైన ప్రాంతం పరిశీలన

జడ్చర్ల, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): వర్షాలు కురుస్తున్న కారణంగా చెరువులు, వాగులు నిండి లోలెవల్‌ కాజ్‌వేలు, ప్రధాన రహదారులపై నీటి ప్రవాహాల వద్దకు ఎవరూ వెళ్లొద్దని కలెక్టర్‌ విజయేందిర బోయి చెప్పారు. జడ్చర్ల మండలం కిష్టారం, అంబటాపురం గ్రామాల మధ్య రోడ్డుపైకి చేరిన పోతిరెడ్డి చెరువు నీటిలో భార్యా భర్తలు గల్లంతయిన ప్రాంతాన్ని కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. ఘటనా స్థలానికి ఉదండాపూర్‌ నుంచి కారు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో కలెక్టర్‌ దిచక్రవాహనంపై వెళ్లారు. గల్లంతయిన అంబటాపూర్‌ గ్రామానికి చెందిన తానెం బాలయ్య, రాములమ్మ దంపతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. గల్లంతైన వారి కోసం చేపడుతున్న గాలింపు చర్యలను జిల్లా అగ్నిమాపక అధికారి కిశోర్‌, జడ్చర్ల ఫైర్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి అధికారి మల్లికార్జున్‌లను అడిగి తెలుసుకున్నారు. 15 మంది ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందం గాలింపు చేపడుతున్నారని డీఎ్‌ఫఓ కిశోర్‌ కలెక్టర్‌కు వివరించారు. గాలింపులో ఒక ప్రాంతంలో రాములమ్మ చీర లభ్యమైందని తెలిపారు. కిష్టారం నుంచి అంబటాపూర్‌ గ్రామానికి మంజూరైన రోడ్డు పనులు చేపట్టి, లోలెవల్‌ కాజ్‌వే స్థానంలో హైలెవల్‌ బ్రిడ్జిని నిర్మించాలని అంబటాపూర్‌ గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు. గ్రామస్థుల విజ్ఞప్తిని ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాలని పంచాయతీరాజ్‌శాఖ డీఈని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ ఆర్డీఓ నవీన్‌, తహసీల్దార్‌ నర్సింగ్‌రావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 11:23 PM