ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:01 PM
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు చెప్పారు.
- ప్రజావాణి సమస్యలపై అధికారులను ఆదేశించిన కలెక్టర్ సంతోష్
గద్వాల న్యూటౌన్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలె క్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందా యని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
యూరియా కొరత లేకుండా సరఫరా
జిల్లాలో రైతులకు సరిపడినంతగా యూరియా, ఎరువుల నిల్వలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. రైతులకు యూరియా సరఫరాపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలసి సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 8,124 మెట్రి క్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, 5,816 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ అఽధికారి సక్రియానాయక్, సంబంధిత అధికారులు ఉన్నారు.