సరిహద్దులో అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వొద్దు
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:40 PM
సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వకూడదని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆ దేశించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
అయిజ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వకూడదని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆ దేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం అయిజ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్, స్టేషన్ రికార్డుల మెయింటెనె న్స్‌ను పరిశీలించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను అడిగి తెలుసుకున్నా రు. అధిక నేరాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్ట్‌లుగా గుర్తించి పగలు, రాత్రి బీట్ డ్యూటీల ద్వారా కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. కర్నాటక, రాయలసీమ ప్రాంతాలు సరిహద్దులుగా ఉన్న కారణంగా అక్రమ రవాణా జరుగకుండా నిఘా ఉంచాలని తెలిపారు. స్టేషన్‌కు వచ్చిన ప్రతీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో ఉం చాలన్నారు. రౌడీషీటర్లపై, అనుమానితులపై నిఘా ఉంచాలని, గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో కలిసిపోవాలని, అలాంటప్పుడే మనకు పూర్తిస్థాయి సమాచారం వారి నుంచి అందు తుందన్నారు. సీసీకెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల నివారణపై దృష్టి పెట్టాలన్నారు. బ్లూకోల్డ్ సిబ్బంది ప్రతి పాయింట్‌ను తనిఖీ చేయాలని 100 కాల్స్‌కు త్వరగా స్పందించాలని ఆదేశించారు. పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను బాధితులకు అందజేశారు. సీసీ కెమెరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగులయ్య, శాంతినగర్ సీఐ టాటాబాబు, ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.