Share News

బాధ్యతలు స్వీకరించిన డీఎంహెచ్‌వో

ABN , Publish Date - Apr 23 , 2025 | 11:16 PM

జిల్లా వైద్యాధికారిగా జయచంద్రమోహన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన డీఎంహెచ్‌వో
డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన జయచంద్రమోహన్‌కు పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతం పలుకుతున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో శైలజ, సిబ్బంది

నారాయణపేట టౌన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్యాధికారిగా జయచంద్రమోహన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జయచంద్రమోహన్‌ జనరల్‌ ఆసుపత్రిలో ఆర్‌ఎంవోగా వి ధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మిపై అవినీతి ఆరోపణలు రావడంతో కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఉ త్తర్వులో ఆదేశించింది. ప్రస్తుతం డీఎంహెచ్‌వోగా జయ చంద్రమోహన్‌ను నియమించారు. ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించగా డిప్యూటీ డీ ఎంహెచ్‌వో శైలజ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. వెంట సిబ్బంది ఉన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 11:16 PM