జిల్లా క్రీడాకారులు రంజీకి ఆడాలి
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:06 PM
జిల్లా క్రీడాకారులు రంజీకి ఎ దగాలని జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కా ర్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు.
- గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చాటాలి
- జిల్లా క్రికెట్ సంఘం సెక్రటరీ ఎం. రాజశేఖర్
- ఉత్సాహంగా క్రికెట్ జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా క్రీడాకారులు రంజీకి ఎ దగాలని జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కా ర్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు విశాఖ ఇండస్ట్రీస్ సౌ జన్యంతో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జి.వెంకట స్వామి కాక మెమోరియల్ టీ-20 క్రికెట్ ఉ మ్మడి జిల్లాల లీగ్ నిర్వహించనున్నారు. టో ర్నీలో పాల్గొనే మహబూబ్‌నగర్ జట్టు ఎంపి కలను బుధవారం జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీసీఏ సె క్రటరీ రాజశేఖర్ మాట్లాడుతూ ఈ లీగ్‌లో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జట్లు పాల్గొంటాయని తెలిపారు. ప్రతీ జట్టు నాలు గేసి మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపారు. ఉమ్మ డి జిల్లా టోర్నీలో పాల్గొనే జట్ల క్రీడాకారులు ప్రతిభ చాటితే ఉమ్మడి జట్టుకు ఎంపిక చే స్తామని తెలిపారు. ఈ జట్టు తెలంగాణ అం తర్‌జిల్లాల టోర్నీలో పాల్గొంటుందని తెలిపా రు. గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభ చా టాలన్నారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రతినిఽ దులు సురేష్‌కుమార్, వెంకట్రామరావు, గోపా లకృష్ణ, సీనియర్ క్రీడాకారులు మన్నాన్, ము ఖ్తర్, అబిద్ పాల్గొన్నారు.